ఏపీ పీజీ సెట్‌ షెడ్యూలు విడుదల

పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీజీసెట్‌)-2021 షెడ్యూలును ఉపకులపతి మునగాల సూర్యకళావతి విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లోని కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్లు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది. పూర్తి వివరాల కోసం www.yogivemanauniversity.ac.in, www.yvu.edu.in, http://sche.ap.gov.in వెబ్‌సైట్లను చూడాలన్నారు.