బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారంటే..

తెలుగు బిగ్ బాస్ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే నాల్గు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మంది సభ్యులతో బిగ్ బాస్ సీజన్ 5 మొదలవ్వగా..ఇప్పుడు నలుగురు హౌస్ ను వదిలిపెట్టి వెళ్లారు. సరయు , ఉమాదేవి , లహరి తో పాటు నిన్న నటరాజ్ ఎలిమెంట్ అయ్యారు. ఇక సోమవారం హౌస్ లో నామినేషన్ల పర్వం సాగింది.

ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ ను పవర్ రూమ్‌కు పిలిచారు బిగ్ బాస్. ఇద్దరు సభ్యులను నామినేషన్ కు ఎంచుకుని బిగ్ బాస్‌కు ప్రైవేట్‌గా చెప్పమని ఆదేశాలు జారీచేశారు. దీంతో హౌస్ సభ్యులు తాము అనుకున్న సభ్యుల పేర్లు తెలిపారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయినట్టు తెలుస్తోంది.

రవి, లోబో, ప్రియా, సన్నీ గత వారం నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ లో తొమ్మిది మంది నామినేటెడ్ కాగా, అందులో ఎవరు బిగ్ బాస్ హౌస్ ను వీడి వెళ్తారో చూడాలి. ఇక నిన్న నటరాజ్ మాస్టర్ హౌస్ ను వీడి వెళ్తున్న సమయంలో సభ్యులంతా ఎమోషనల్ కు గురయ్యారు.

Nominations day..Evari reasons ento chuddam! #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/OTPnaaQ2Fp— starmaa (@StarMaa) October 4, 2021