వైజయంతీ మూవీస్‌ చిత్రంలో బిగ్‌బి జాయిన్‌

యూనిట్‌ సభ్యుల సంతోషం

Big B oins in Vyjayanti Movies
Big B oins in Vyjayanti Movies

అగ్రశేణి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన మెగా బడ్జెట్‌ ,యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న బహుభాషా చిత్రంలో ఒక కీలక పాత్ర చేయటం కోసం లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ను తీసుకొస్తుండటం విశేషం..

ప్రభాస్‌, దీపికా పడుకొనేలతో షూటింగ్‌లో ఆయన జాయిన్‌ అవ్వబోతున్నారు.ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు..

అమితాబ్‌గారు ఎన్టీఆర్‌ను ఎంతగానో ఇష్టపడేవారని, అమితాబ్‌ చేసిన కొన్ని సూపర్‌హఙట్‌ బాలీవుడ్‌ సినిమాలు తెలుగులో రీమేక్‌ల్లో ఆయన నటించారన్నారు.

ఎన్టీఆర్‌, తను షోలే సినిమాను అనేకసార్లు చూశామన్నారు. ఆ సినిమా ఎన్టీఆర్‌కు చెందిన రామకృష్ణ థియేటర్‌లో ఏడాదికిపైగా ఆడిందన్నారు.

ఇన్నాళ్ల తర్వాత తమ బ్యానర్‌ వైజయంతీ మూవీస్‌ తలపెట్టిన ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం అవుతున్న భారతీయ సినిమా గ్రేటెస్ట్‌ ఐకాన్‌ అమితాబ్‌గారికి స్వాగతం పలకటం నిజంగా తనకు లభించిన అద్భుతమైన అత్యంత సంతృప్తికరణ క్షణం అన్నారు.

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఎట్టకేలకు ఒక కల నిజమవుతోంది. లెజండరీ అమితాబ్‌ సార్‌తో స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకుంటున్నాను..అని పేర్కొన్నారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, తనకున్న ఎన్నో ఆఫర్లలో మా ఫిల్మ్‌ను అమితాబ్‌ సార్‌ ఎంచుకోవటం తనకు లభించిన అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నానని అన్నారు..

సహనిర్మాతలు స్వప్నా దత్‌, ప్రియాంకా దత్‌ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 2022లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/