బైడెన్ రికార్డుస్థాయి ఫలితాలు
అమెరికా చరిత్రలో నూతన అధ్యాయం

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ రికార్డుస్థాయిలో చరిత్ర సృష్టించారు.
అమెరికా కాలమానం ప్రకారం (బుధవారం మధ్యాహ్నం) బైడెన్‌కు మొత్తం 6.99 కోట్ల ఓట్లు పోలయ్యాయి..
ఇది అమెరికా చరిత్రలో ఇప్పదాకా ఏ అభ్యర్థి ఇంత పెద్దమొత్తంలో ఓట్లు సాధించలేదు.. ఇదిలా ఉండగా ట్రంప్ ఇప్పటివరకు 6.68 కోట్ల ఓట్లను సాధించారు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తూ బైడెన్ అధ్యక్ష పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270కు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది..
బైడెన్ ఖాతాలో కడపటి వార్తలు అందేసరికి 227 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.. ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లను దక్కించుకున్నారు.
ఇదలా ఉండగా, అరిజోనా, అలాస్కా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవాడా, జారియా, నార్త్ కరోలినా రాష్ట్రాలకుసంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/