ఈరోజు ‘భీమ్లా నాయక్‌’​ నుండి మైండ్ బ్లాక్ అయ్యే ‘లాలా భీమ్లా’ ప్రోమో రాబోతుంది

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..ఆ అంచనాలకు తగ్గట్లే సంక్రాంతి బరిలో గ్రాండ్ గా ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇదిలా ఉంటె దీపావళి కానుకగా అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ నుండి ‘లాలా భీమ్లా’ సాంగ్​కు సంబంధించిన ప్రోమోను ఈరోజు సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ వార్త తెలుపుతూ.. పవన్​ మాస్​లుక్​లో ఉన్న ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్​ మాస్​ లుక్​లో మందు సీసా, బాంబులను పక్కన పెట్టుకుని కూర్చొని
కనిపించారు.

Let’s celebrate this diwali with #TheSoundOfBheemla 🥁❤️‍🔥#LalaBheemla Video Promo out today at 07:02pm🔥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/rOf6nqGQXG— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021