ఖర్చులేని అందమైన వార్డ్‌ రోబ్‌

ఇంట్లో డెకరేషన్‌

ward‌ Rob‌
ward‌ Rob‌

కొంత మంది ఫ్యాషన్‌ మీద ఉన్న మోజుతో రకరకాల బట్టలు కొంటుంటారు.

కొత్త డ్రెస్సులు అంతగా కొనే బదులు ఉన్న వాటితోనే అందమైన వార్డ్‌ రోబ్‌ తయారు చేసుకోవచ్చు.

కొంత మంది ఇష్టమైన చీరలు, అనార్కలి డ్రెస్సులు, చుడీదార్స్‌ ఎక్కువగా కొంటుంటారు. పైగా వాటిని రెగ్యులర్‌గా వాడరు. అవి పాతబకుండానే మళ్లీ కొత్తవి కొనేస్తారు.

తర్వాత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టామని బాధ పడతారు. అలాంటి వారు ఖర్చు లేకుండా అందమైన వార్డ్‌ రోబ్‌ తయారుచేసుకోవచ్చు.

ప్రతి నెల వార్డ్‌ రోబ్‌ను సర్దుకునే విధానంలో మార్పులు చేస్తే చాలా ఫలితాలుంటాయి.

ఎప్పుడూ పాత దుస్తులనే చూస్తున్నారనే భావన కలగదు. బట్టలు రీ ఎరేంజ్‌ చేసేటప్పుడు నచ్చిన వాటిని మొదటి వరులో పెట్టి పెద్దగా నచ్చని వాటిని వెనుక వరుసలో పెట్టాలి.

అలాగే కొని కూడా వాడని దుస్తులను మొదటి వరుసలో పెట్టి ఎక్కువగా వాడిన వాటిని వెనుక వరుసలో పెట్టాలి.

వార్డ్‌ రోబ్‌కు మంచి లుక్‌ రావాలంటే నెలకు ఒకసారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కొని వాడని మంచి దుస్తులు ఏవైనా ఉంటే వాటిని అడిగి తీసుకోవాలి.

వాటికి కూడా వార్డ్‌రోబ్‌లో చోటు కల్పించాలి. వీలైతే అలా అడిగి తీసుకున్న దుస్తులను మళ్లీ రీ డిజైన్‌ చేసి కొత్త ఫ్యాషన్‌ లుక్‌ ఇవ్వాలి.

ఇలా చేయడం వల్ల ఖర్చు కలిసొ స్తుంది. వార్డ్‌ రోబ్‌ సర్దడం ఒక ఎత్తైతే కలర్‌ కాంబినేషన్‌ ఆధారంగా విభజించుకోవడం మరో ఎత్తు. అందుకే ఒకసారి క్లోజెట్‌ మొత్తాన్ని తేరిపార చూడాలి.

ఏ చీరకు ఏ బ్లౌస్‌ మ్యాచ్‌ అవుతుందో ఏ మిడ్డీకి ఏ రంగు స్కర్ట్‌ మ్యాచ్‌ అవుతుందో ఒకసారి పరిశీలిం చాలి. వాటికనుగుణంగా క్లోజెట్‌లో మార్పులు చేస్తే లుక్‌ అదిరిపోతుంది.

వార్డ్‌రోబ్‌లో దుస్తులతో పాటు ఫ్యాషన్‌ ఐటమ్స్‌, నగలు, ఆభరణాలు, జుమ్కీలు మొదలైన వాటికి చోటు కల్పించాలి.

దుస్తులను సెలెక్ట్‌ చేసుకునేటప్పుడు అందుకు మ్యాచ్‌ అయ్యే వస్తువులను కూడా ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల పదేపదే పాత దుస్తులను ధరిస్తున్నారనే ఫీలింగ్‌ రాదు. వార్డ్‌ రోబ్‌కు కూడా కొత్త లుక్‌ వస్తుంది. పాత బట్టలను మళ్లీ కొత్తగా రీ డిజైన్‌ చేయాలి.

వాటిని నచ్చినట్లు ఆల్టరేషన్‌ చేసి కొత్త డిజైన్స్‌ తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్లఖర్చు కూడా కలిసొస్తుంది. అదేవిధంగా క్రియేటివిటీ కూడా డెవలప్‌ అవుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/