క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజ్ బొమ్మై ప్ర‌మాణ స్వీకారం

బొమ్మైతో ప్ర‌మాణ స్వీకారం చేయించిన‌ గ‌వ‌ర్న‌ర్ గ‌హ్లోత్

బెంగుళూరు : క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో ఉన్న రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రమాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. బ‌స‌వ‌రాజ్ బొమ్మైతో గ‌వ‌ర్న‌ర్ గ‌హ్లోత్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. క‌ర్ణాట‌క రాష్ట్ర 23వ సీఎంగా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాజా మాజీ ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప కూడా పాల్గొన్నారు. బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని క‌ర్ణాట‌క బీజేపీ నేత‌లు అందరూ ఆమోదించారు.

ఇంత‌కు ముందు వ‌ర‌కు హోంమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొన‌సాగారు. ఆయ‌న‌ మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. అంతేగాక‌, యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. కాగా, క‌ర్ణాట‌క‌కు ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఆ పదవులు చేప‌ట్ట‌నున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/