ప్రజల తరుపున జనసేనతో కలిసి పోరాటం చేస్తాం

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎవరు ప్రశాతంగా ఉన్నారో సిఎం జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చేసే ప్రతి పిచ్చి పనికి కేంద్రం సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల ముందు మూడు రాజధానుల ప్రతిపాదనను ఎందుకు వైఎస్‌ఆర్‌సిపి చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిని తరలించేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరు అని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరపున జనసేనతో కలిసి పోరాడుతామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/