మంత్రి పదవి నుంచి నన్ను తొలగించండి: సీఎం కు మంత్రి విజ్ణప్తి

జైపూర్‌: రాజస్తాన్‌కు చెందిన ఒక మంత్రి తన పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తన పదవిని క్రూరమైన పదవని ఆ బాధ్యతను తాను మోయలేనంటూ చెప్పుకొచ్చారు. పైగా తనకున్న బాధ్యతలను ఎవరికి ఇవ్వాలో కూడా సూచించడం గమనార్హం. రాజస్తాన్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కి కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో మంత్రి అశోక్ చంద్ర ఒకరు. యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్, ఎంటర్‌ప్రెన్యూర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ రిలీఫ్ వంటి కీలక శాఖలకు ఆయన మంత్రి. అయితే ఏం జరిగిందో తెలియదు. తనకిచ్చిన ప్రొటోకాల్స్ అన్నింటినీ తొలగించాలని ముఖ్యమంత్రి గెహ్లోట్‌కు బహిరంగంగా విజ్ణప్తి చేసుకున్నారు.

ఈ శాఖలన్నింటినీ మంత్రి కుల్దీప్ రాణాకు బదిలీ చేయాలని కోరారు. చివర్లో ఈ శాఖలన్నింటికీ ఆయనే మంత్రి అంటూ వ్యంగ్యంగా స్పందించారు. శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బుండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు చంద్ర. రాజస్తాన్ గిరిజన నాయకుడు, ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రాతో భూవివాదాలపై చంద్రకు కొద్ది రోజులుగా తగాదాలు ఉన్నాయి. ఈ విషయమై అధికార యంత్రాంగంతో చంద్రకు చాలాసార్లు వాగ్వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవిని వదులుకోవడం గమనార్హం. కాగా, ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశాలు ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/