చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలు

ప్రముఖ చలనచిత్ర నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

Indian Scientists Who Made History- Actor, MLA Bala Krishna

అమరావతి : చంద్రుని దక్షణ ధృవం పై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ఇస్తో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారన్నారు. చంద్రుడుపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుందని అన్నారు. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నానని , .140కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు అని పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/