పాకిస్థాన్‌ పర్యటనను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా!

south-africa-skip-pakistan-tour
south-africa-skip-pakistan-tour

కేపేటౌన్‌: అధిక పని ఒత్తిడి కారణంగా దక్షిణాఫ్రికా జట్టు తమ పాకిస్థాన్‌ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ఆడటానికి దక్షిణాఫ్రికా జట్టు పాక్ పర్యటనకు వెళ్లాలి. అయితే.. వర్క్‌లోడ్‌ ఎక్కువ ఉన్న కారణంగా ఆ టూర్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటిల్‌ జాక్వస్‌ ఫాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తామన్నారు. ‘మా అంతర్జాతీయ షెడ్యూల్‌లో పాకిస్తాన్‌ పర్యటన ఉంది. దాన్ని సాధ్యమైనంత త్వరలోనే నిర్వహిస్తాం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై పనిభారం అధికం అయిన కారణంగా పాక్‌ పర్యటన వాయిదా వేయక తప్పలేదు. పీసీబీ కూడా మా నిర్ణయాన్ని ఒప్పుకుంది. ఈ సిరీస్‌ ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తాం’ అని జాక్వస్‌ ఫాల్‌ పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/