పోలీసులు ఉండగానే బైరి నరేశ్ ఫై అయ్యప్ప భక్తుల దాడి

మరోసారి బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో నరేష్ ఫై దాడి చేసారు. కొద్దీ రోజుల క్రితం నరేష్ అయ్యాప్పస్వామి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు నరేష్ ను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. అంతే కాకుండా నరేష్ ఫై దాడి కూడా చేసారు. ఈ క్రమంలో పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేసారు. ఈ మధ్యనే కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అతడు బయటకొచ్చాడు.

అయ్యప్ప స్వామిపై మరోసారి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి అయ్యప్ప భక్తులు ఆగ్రహం తో ఉన్నారు. ఇదే క్రమంలో పోలీసులు నరేష్ ను వెహికలు తీసుకెళ్లడం చూసిన కొంతమంది భక్తులు వెహికలును వెంబడించి, నరేష్ ను కిందకు లాగి దాడి చేశారు. మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ… తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణను అడిగానని… పోలీసుల వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పాడు. పోలీసుల వాహనంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్ లైసెన్స్ కావాలని కోరాడు. ఇక దాడికి సంబదించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.