వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు
అన్ని రాష్ట్ర డిజిపిలకు కేంద్రం ఆదేశాలు

దిల్లీ: కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు రాష్ట్రాల డిజిపిలకు కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం వైద్య సిబ్బందిపై దాడి జరిగింది. అలాగే నిజామాబాద్‌లో వైద్యసిబ్బంది విదులకు అడ్డు తగులుతూ వారిపై దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లో ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లిన వారి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సిబ్బందిపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/