కరోనా నివారణకు బాలయ్య భారీ విరాళం

50లక్షల చెక్‌ను కెటిఆర్‌కు అందజేసిన బాలయ్య

balakrishna
balakrishna

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణకు పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చిన సంగతి విధితమే. అందులో భాగంగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 1.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇందులో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహయనిధికి, మరో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సహయనిధికి, 25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 50లక్షల విరాళం తాలూకు చెక్‌ ను నేడు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కు స్వయంగా బాలకష్ణ అందించారు. కాగా విరాళం అందించినందుకు బాలయ్యకు కెటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/