60 ఏళ్ల పాటు తిరుగులేని నటుడిగా ఖ్యాతినార్జించారుః

సత్యనారాయణ మరణం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరని లోటన్న అచ్చెన్న

atchannaidu

అమరావతిః సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, విభిన్న పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా ఎదిగిన కైకాల సత్యనారాయణ మరణం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరనిలోటని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కైకాల సత్యనారాయణే అనేంతగా ఆయన తన నటనతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. 60 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా కైకాల ఖ్యాతినార్జించారని కొనియాడారు.

అలానే 1996లో మచిలీపట్నం (బందరు) ఎంపీగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సత్యనారాయణ ఘనవిజయం సాధించి, రాజకీయ అరంగేట్రం చేశారని చెప్పారు. సినీ, రాజకీయరంగాలలో తనదైన శైలిలో ప్రజ్ఞాపాటవాలతో ప్రజల్ని మెప్పించిన వ్యక్తి మరణం తెలుగుజాతికే తీరనిలోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

తాజ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/