నేడు ప్రధానితో ఢిల్లీ సిఎం భేటి

సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మోడితో భేటి

CM Arvind-Kejriwal- PM Modi
CM Arvind-Kejriwal- PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడితో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు భేటి కానున్నారు. ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధానిని కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో గతవారం అమిత్‌షాను కలిసిన కేజ్రీవాల్ పరిస్థితిపై చర్చించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/