మరోసారి లీక్ కారణంగా ఆర్టెమిస్ 1 రాకెట్ ప్రయోగం వాయిదా..

ఆర్టెమిస్ 1 రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌గా చెప్పబడుతున్న ప్రయోగం కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆసక్తి బ్రేకులు పడుతున్నాయి. ఇంధన లీకేజీ కావడంతో ఈ ప్రయోగాన్ని నిలిపేస్తున్నట్లు నాసా తెలిపింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండోసారి ప్రయోగాన్ని శనివారం రాత్రి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈసారి కూడా ఇంధన లీకేజీ సమస్య తలెత్తడంతో.. ‘చంద్రుడిపైకి వెళ్లాల్సిన ఆర్టెమిస్- 1 మిషన్‌ వాయిదాపడింది.

రాకెట్ లో ఇంధనం నింపుతుండగా లీక్ అవుతున్నట్టు గమనించారు. దాన్ని సరి చేసేందుకు ప్రయతించిన అది కుదరలేదు.ఇంధనం లీక్ అవుతుండటంతో ప్రయోగాన్ని ఆపేసింది. ఈ విషయాన్నీ నాసా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. భవిష్యత్తులో మానవులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ‘ఆర్టెమిస్1’ అనే వ్యోమ నౌకను చంద్రుడిపై పంపేందుకు నాసా ఈ మిషన్ చేపట్టింది. ఇందుకోసం ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.