సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవ జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/