కాల్పులు జరిపిన జవాన్ రైలు కింద పడి ఆత్మహత్య

Army jawaan Balaji (File)

cherukupalli (Guntur District): రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామం లో కాల్పుల కలకలం.  ప్రేమను నిరాకరించిందని యువతిపై అతని తల్లిపై ఆర్మీ జవాన్ కాల్పులు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స .నడుం పల్లి గ్రామానికి చెందిన మురాల రమాదేవి, ఆమె కుమార్తె నాగజ్యోతి ప్రేమకు నిరాకరించిందని కారణంతో నల్లమోతు వారి పాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాలాజీ కాల్పులు జరిపాడు.ఆర్మీలో పని చేస్తూ వివాహం చేసుకుంటానని నాగజ్యోతి ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో గత డిసెంబర్లో బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాగజ్యోతి రేప్ కేసు పెట్టడంతో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన బాలాజీ శుక్రవారం రాత్రి2 గంటలు దాటిన తర్వాత రివాల్వర్ ,మరణాయుధాలు  తో రమాదేవి ఇంటికి వచ్చి తల్లి, కుమార్తె పై కాల్పులు జరిపాడు .రమాదేవి కి చెవి దగ్గర గాయమైంది.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే డెడ్ బాడీని తెనాలి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసును దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/