కొత్త కారులో బిగ్ బాస్ ఫేమ్ అరియనా చక్కర్లు

బిగ్ బాస్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వారిలో అరియనా ఒకరు. బిగ్ బాస్ షో కు ముందు సామాన్య యాంకర్ గానే అందరికి తెలుసు. బిగ్ బాస్ ఛాన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణమే ఆమె జాతకం మొత్తం మారిపోయింది. టైటిల్ రేస్ వరకు వెళ్లిన ఈమె..ఈ షో ద్వారా గట్టిగానే సంపాదించింది. ప్రస్తుతం బిగ్ బాస్ 5 బజ్ కు యాంకర్ గా చేస్తూ..మరోపక్క సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. ఈ తరుణంలో ఈ భామ ఓ కొత్త కార్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.

కొత్త కారు కొన్నద అరియానా అయినా కూడా దాన్ని మాత్రం సెలెబ్రేట్ చేస్తోంది సోహెల్, అమర్ దీప్‌లే. బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ ఫ్రెండ్ అయితే.. సినీ ఇండస్ట్రీలో అమర్ దీప్ అరియానాకు క్లోజ్ ఫ్రెండ్. బిగ్ బాస్ కంటే ముందే ఈ ఇద్దరూ సన్నిహితులు. అమర్ దీప్ ఇప్పుడు జానకీ కలగనలేదు అనే సీరియల్‌తో ట్రెండ్ అవుతున్నాడు. మొత్తానికి ఈ ముగ్గురు కొత్త కారులో షికారుకు వెళ్లినట్టు కనిపిస్తోంది.

View this post on Instagram

A post shared by Ariyana Glory (@ariyanaglory)