ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా అద్దె బస్సులను తీసుకొస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా అద్దె బస్సులను తీసుకొచ్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ప్రస్తుతం మొత్తం 11వేల271 బస్సులు ఉంటే.. వీటిలో 3500కుపైగా బాగా పాతబడ్డాయి.. వీటితో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి స్థానంలో కొత్త బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడంతో పాటూ.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్‌ ప్రక్రియ చేయనున్నారు. దాదాపు 2 వేల డీజిల్‌ బస్సులను ఈ–బస్సులుగా మార్చేందుకు సిద్ధమయ్యారు.

త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో తీసుకరాబోతుంది. ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండోవారం నాటికి పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు తిప్పాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీలో ఉన్న దాదాపు 2 వేల డీజిల్‌ బస్సులను ఈ–బస్సులుగా మార్చేందుకు రెట్రోఫిట్‌మెంట్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటె తాజాగా బస్ చార్జీలు పెంచడం పట్ల ప్రతిపక్ష పార్టీ లు , ప్రయాణికులు ఆర్టీసీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.