హెలికాప్టర్ కూలిన ఘటనపై ప్రధాని అత్యవసర భేటీ

హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుటుంబం
కాసేపట్లో పార్లమెంటులో ప్రకటన చేయనున్న రాజ్ నాథ్

న్యూఢిల్లీ : తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోడీకి వివరించారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ కొద్దిసేపట్లో పార్లమెంటులో క్లుప్తంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు కాగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఆయన అర్ధాంగి ఉన్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/