ఏపీ కొత్తమంత్రుల శాఖల వివరాలు

ఏపీలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యింది. మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయగా..వారికీ శాఖలను కేటాయించారు. ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించింది జగన్ సర్కార్. అలాగే హోంమంత్రి పదవి తానేటి వనితకు ఇవ్వగా.. డిప్యూటీ సీఎంలుగా నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, ముత్యాల నాయుడు, రాజన్న దొరకు పదవులు దక్కాయి.

మంత్రుల శాఖల వివరాలు చూస్తే…

అంబటి రాంబాబు- నీటిపారుదలశాఖ
అంజాద్‌ బాషా-మైనార్టీ సంక్షేమశాఖ
ఆదిమూలపు సురేష్-మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాక
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు-పంచాయతీరాజ్ శాఖ
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి-ఆర్థికశాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ- బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ
దాడిశెట్టి రాజా -రోడ్లు భవనాలు
ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూశాఖ
గుడివాడ అమర్‌నాథ్‌-పరిశ్రమలు, ఐటీ,
గుమ్మనూరు జయరామ్‌-కార్మికశాఖ
జోగి రమేష్-గృషనిర్మాణశాఖ
కాకాణి గోవర్థన్ రెడ్డి-వ్యవసాయశాఖ
కారుమూరి నాగేశ్వరరావు-పౌరసరఫరాలశాఖ
కొట్టు సత్యనారాయణ-దేవాదాయశాఖ
నారాయణస్వామి-ఎక్సైజ్‌శాఖ
ఉష శ్రీ చరణ్‌ -మహిళ, శిశు సంక్షేమశాఖ
మేరుగ నాగార్జున-సాంఘిక సంక్షేమశాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-విద్యుత్, సైన్స్, అటవీశాఖ
పినిపె విశ్వరూప్‌- రవాణాశాఖ
రాజన్నదొర-గిరిజనశాఖ
ఆర్కే రోజా -టూరిజం, సాంస్కృతిక శాఖ
సీదిరి అప్పలరాజు-మత్స్య, పశుసంవర్థకశాఖ
తానేటి వనిత- హోంశాఖ
విడదల రజని-వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ