ఏపీ హైకోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి ..

ఏపీ హైకోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పదగా మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది. కర్నూలు శివారు సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని పోలీసులు, కుంటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ఏప్రిల్ 7 నుండి ఆవుల వెంకటేశ్వర్లు కనిపించకుండాపోయారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు కనిపించకపోవడం తో కుటుంబ సభ్యులు మహానంది పీఎస్ లో పిర్యాదు చేసారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. పిర్యాదు తీసుకున్న మహానంది పోలీస్ స్టేషన్ పోలీసులు వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికం నగర్ లో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో వకాలత్ తీసుకొని కోర్టులో ఆవుల వెంకటేశ్వర్లు వాదిస్తున్నారు. అయితే.. ఆవుల వెంకటేశ్వర్లును ఎవరో చంపి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దీనిని ఛేదించే పనిలో ఉన్నారు.