స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై విచారణ

తీర్పును రిజర్వులో పెట్టిన ఏపి హైకోర్టు

High court of andhra pradesh
High court of andhra pradesh

అమరావతి: ఏపిలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగగా, ముగిసింది. ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ బిర్రు ప్రతాప్‌ రెడ్డి ఏపి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదిస్తూ.. 59.85 శాతం రిజర్వేషన్లు సుప్రీం తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అయితే బదులుగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. గతంలో సుప్రీంకోర్టు తెలిపినట్లుగా, ప్రత్యేక సందర్భాల్లో 50 శాతం మించవచ్చునని తెలిపారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో 2010లో సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ఏపి ప్రభుత్వం జీవో ఇచ్చిందని బిర్రు ప్రతాప్‌ రెడ్డి, బిసి రామాంజనేయులు వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లో కూడిన ధర్మాసనం స్టే ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా ఈ అంశంపై ఏపి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరిపి తగిన ఉత్తర్వులివ్వాలని నిర్దేశించింది. కాగా విచారణ చేపట్టిన ఏపి హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/