క్యాబ్‌ అధ్యక్షుడిగా అవిషేక్‌.. సెక్రటరీగా దాదా సోదరుడు

Sourav Ganguly, Snehaish Ganguly and Avishek Dalmiya
Sourav Ganguly, Snehaish Ganguly and Avishek Dalmiya

కోల్‌కతా: కోల్‌కతా క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా అవిషేక్‌ దాల్మియా ఎన్నికయ్యారు. అవిషేక్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, దివంగత జగ్‌మోహన్‌ దాల్మియా కుమారుడే అవిషేక్‌. జగ్‌మోహన్‌ దాల్మియా గతంలో క్యాబ్‌ అధ్యక్షుడిగా, ఐసిసి ప్రెసిడెంటుగా కూడా సేవలందించిన విషయం తెలిసిందే. 38 ఏళ్లకే క్యాబ్‌ అధ్యక్ష పీఠంలో కూర్చొని, ఈ పదవి దక్కించుకున్న పిన్నవయస్కుడిగా అవిషేక్‌ నిలిచారు. మరోవైపు క్యాబ్‌ ముఖ్య కార్యదర్శిగా స్నేహాశిష్‌ గంగూలీ ఎంపికయ్యారు. స్నేహాశిష్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ సోదరుడు కావడం విశేషం. ఎన్నిక అనంతరం అవిషేక్‌, స్నేహాశిష్‌ ఇద్దరినీ బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అభినందించారు. ఎంపికైన క్యాబ్‌ నూతన కార్యవర్గానికి ప్రముఖ క్రికెటర్లు, క్యాబ్‌ మాజీ కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/