చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గత కొద్దీ వారం రోజులుగా ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు సంబదించిన పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం ఫై విపక్షాలు మండిపడ్డారు. అయితే గణేశ్ ఉత్సవాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఈ తరుణంలో ఏపీ హైకోర్టు చవితి ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.