అమరావతి అసైన్డ్ భూముల కేసు.. విచారణ వాయిదా

కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్

ap high court
ap high court

అమరావతిః అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణను ఏపీ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. ఈరోజు తీర్పును వెలువరిస్తామని హైకోర్టు గత విచారణ సమయంలో తెలిపింది. అయితే ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోని తీసుకుని విచారించాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేసింది. కొత్త ఆధారాలను (ఆడియో ఫైల్స్) పరిశీలించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. కేసు రీఓపెన్ పై అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని సూచించింది.