ఏపీ మందు బాబులకు కిక్కించే న్యూస్..

ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులకు కిక్కించే వార్త తెలిపింది జగన్ సర్కార్. రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి..అధికారంలోకి రాగానే ఆ దిశగా అడుగులేశారు. రాష్ట్రంలో వైన్ షాప్స్ తగ్గించడం..మద్యం ధరలు భారీగా పెంచడం..ప్రధాన బ్రాండ్లు లేకుండా ఊరు పేరులేని బ్రాండ్లను తీసుకరావడం ఇలా ఎన్నో చేసినప్పటికీ మద్యం ప్రియులు మాత్రం మద్యం తాగడం తగ్గించలేదు. ప్రభుత్వం ఫై విమర్శలు చేశారే తప్ప పూర్తిగా మద్యాన్ని బంద్ చేయలేదు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతి ఇచ్చి మద్యం ప్రియుల్లో ఆనందం నింపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. ఇకపై క్యాన్ బీర్​తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ వెల్లడించింది. కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు ల్యాబ్‌కు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. లిక్కర్ వాక్‌ఇన్ స్టోర్సులో ధరల చార్ట్ ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.