ఏపీలో ప్రారంభమైన ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

AP EAPCET 2024 registration begins at cets.apsche.ap.gov.in

అమరావతిః ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 లేదా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (cets.apsche.ap.gov.in)ని సందర్శించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఏపీ ఎంసెట్ 2024 పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించింది. అయితే, ఈ ఎంసెట్ ప్రవేశ పరీక్ష మే 13 నుంచి మే 19 వరకు నిర్వహించనున్నారు.

ఏపీఎస్‌సీహెచ్ఈ , ఏపీ ఎంసెట్ లేదా తరపున కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ద్వారా ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాన్ని పొందవచ్చు. అలాగే ఫార్మసీలో డిప్లొమా కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), BVSc, AH, BFSc, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని పొందవచ్చు.

ఏపీ ఎంసెట్ 2024 దరఖాస్తు ఎలా చేయాలి? :

అర్హత గల అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించండి.
ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌ (cets.apsche.ap.gov.in)ను సందర్శించండి.
హోమ్‌పేజీలో ‘AP EAPCET 2024’ కోసం రిజిస్ట్రేషన్ లింక్‌‌పై క్లిక్ చేయండి. ఈ లింక్ వెబ్‌సైట్ మెయిన్ మెనూలో కనిపిస్తుంది.
లింక్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
మీ వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు నింపే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్‌కు వెళ్లండి.
మీకు దరఖాస్తు రుసుమును చెల్లించేందుకు ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తుంది.
పేమెంట్ చేసిన తర్వాత మీ దరఖాస్తు పూర్తి అయినట్టుగా ధృవీకరించండి.
ఆ తర్వాత అప్లికేషన్ పూర్తి చేసిన పేజీని డౌన్‌లోడ్ చేయండి.
ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కన్ఫర్మేషన్ పేజీని ప్రింటవుట్ తీసుకోండి.

ఏపీ ఎంసెట్ 2024 పరీక్షా విధానం :

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో 3 గంటల వ్యవధితో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఈ పరీక్ష మొత్తం 160 మార్కులను కలిగి ఉంటుంది. అభ్యర్థులు 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. పరీక్షకు సంబంధించిన లాంగ్వేజీ మీడియంలో ఇంగ్లీష్/ఉర్దూ లేదా ఇంగ్లీష్/తెలుగులో అందుబాటులో ఉంటుంది.

ఏపీ ఎంసెట్ 2024 దరఖాస్తు ఫీజు :

ఏపీ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏప్రిల్ 30 వరకు రూ. 500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి మే 5 మధ్య దరఖాస్తు చేసుకునే వారికి, ఆలస్య రుసుము రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 600. వెనుకబడిన తరగతులకు రూ. 550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500 దరఖాస్తు రుసుముగా సమర్పించాలి.