హైకోర్టుకు హజరైన ఏపి సీఎస్‌ నీలం సాహ్ని

తదుపరి విచారణ రేపటికి వాయిదా

ap high court
ap high court

అమరావతి: ఏపి ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్‌ఆర్‌సిపి జెండాను పొలిన రంగులు వేయండంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే రంగులు తొలగించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు ఏపి సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యరద్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌లు హాజరయ్యారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఏపి డీజీపీ కూడా ఇటీవల హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.


తాజా కరోనాలాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/