కొత్త మంత్రుల విషయంలో మనసు మార్చుకున్న జగన్..

కొత్త మంత్రివర్గం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. పాత మంత్రుల్లో కేవలం ముగ్గురు , నలుగుర్ని మాత్రమే తీసుకొని , మిగతా వారందర్ని కొత్తవారిని తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గత మంత్రి వర్గంలో పని చేసిన 7 నుండి 11 మంది వరకు తీసుకోవాలని అనుకుంటున్నారట. సీనియారిటీకి చోటు కల్పించాలని ఆలోచన లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది.

సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యంగా… అనుభవం కోటాలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వీరికి మరోసారి ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది చూడాలి. నిన్న గురువారం 24 మంది మంత్రులు రాజీనామా చేసి , జగన్ కు అప్పగించారు. ఈరోజు ఆ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.