ఆసక్తి రేపుతున్న ‘అంటే ..సుందరానికీ ‘ ట్రైలర్ గ్లింప్స్

శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ చేస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను స్పీడ్ చేసింది. ఇప్పటీకే ఫస్ట్ లుక్ , టీజర్ ఆసక్తి రేపగా..తాజాగా ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ‘అంటే సుందరానికీ ..’ సినిమా ట్రైలర్ ను జూన్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. అందులోని హైలైట్స్‌తో గ్లింప్స్ వీడియో విడుదలైంది. ట్రైలర్ లోని విజువల్స్ ను షాట్స్ గా కట్ చేసి వదిలారు. ఈ వీడియో ట్రైలర్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రహ్మణ యువకునిగా నానీ, క్రిస్టియన్ అమ్మాయిగా నజ్రియా నటించిన ఈ సినిమా.. వీరిద్దరి ప్రేమకథ, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యంలో హిలేరియస్ కామెడీని అందించబోతోంది. ఇందులో నానీకి ఒక చెప్పుకోలేని బలహీనత ఉంటుంది. అదేంటి అనేది మేకర్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. అదే ఈ సినిమాకి హైలైట్ కానున్నదని సమాచారం.

YouTube video