‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌’ పథకం అమలు : ప్రధాని మోడీ

PM Modi releases benefits under the PM-CARES for Children Scheme

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌’ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్స‌లో ప్రధాని నరేంద్ర మోడీ పథక ప్రయోజనాలను వెల్లడించారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

కొందరికి ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అవసరమవుతాయి. దానికి సైతం పీఎం కేర్స్​ సాయపడుతుంది. అలాంటి వారికి రోజువారీ ఖర్చుల కోసం ఇతర పథకాల ద్వారా నెలకు రూ.4వేలు అందిస్తున్నాం. ఒక ప్రధాని కాకుండా కుటుంబ సభ్యుడిగా పిల్లలతో మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లల మధ్య ఉన్నందుకు చాలా రిలీఫ్​గా ఉన్నా. దేశంలోని ప్రతిఒక్కరు వారితో ఉన్నారనే భరోసాను పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కల్పిస్తోంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్​ అందుతుంది. వారు 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వస్తాయి. పీఎం కేర్స్​ ద్వారా ఆయుష్మాన్​ హెల్త్​ కార్డు అందిస్తాం. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.

కాగా, ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో వారసత్వం రాజ్యమేలేదని, ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపించేవని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవని, దేశం కొత్త శిఖరాలను చేరుకుంటోందని మోడీ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/