‘అంటే సుందరానికి’ నుండి ‘ఎంత చిత్రం’ సాంగ్ రాబోతుంది

శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ చేస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుండటం విశేషం. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

ఈ చిత్రంలోని ‘ఎంత చిత్రం’ సాంగ్​ను మే 9న ఉదయం 11.07గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్​. దీంతో పాటే హీరోహీరోయిన్లకు సంబంధించిన కొత్త​ పోస్టర్​ను కూడా​ విడుదల చేశారు. ఈ పోస్టర్​ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. దీని చూస్తుంటే మెలోడి లవ్ సాంగ్​ రాబోతున్నట్లు​ అర్థమవుతోంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 జూన్​ 10న ఈ సినిమా విడుదల కానుంది.