అక్షయపాత్ర సిబ్బందికి ధన్యవాదాలు

తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు అవుతోంది…కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అక్షయపాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు అందించాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. అక్షయపాత్రకు, కష్టపడి పనిచేస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు’ అని కెటిఆర్‌ తెలిపారు. కాగా, ఈ క్యాంటీన్లు ప్రతిరోజు వేలాదిమంది ఆకలిని తీరుస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. అంతేకాదు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/