అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపి ప్రభుత్వం

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు

ap state logo
ap state logo

అమరావతి: ఏపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలకు అనుగుణంగా మార్గదర్శకాలు వెలువరిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ అమలవుతుందని, ఆగస్టు 31 వరకూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతి ఉండబోదని పేర్కొంది. ఇదే సమయంలో మూవీ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవరాదని ఆదేశించింది. యోగా శిక్షణా కేంద్రాలతో పాటు జిమ్ లు భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ నిబంధనలు పాటిస్తూ, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పంద్రాగస్టు సందర్భంగా వేడుకలను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవాలని సూచించింది. ఇక కంటెయిన్ మెంట్ జోన్లు అమలవుతున్న ప్రాంతాల్లో నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక్కడ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/