ఆయన చెప్పినట్టే మండలి చైర్మన్‌ వ్యవహరించారు!

మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం దారుణం

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలుచేసినా రాజధాని వికేంద్రీకరణ బిల్లును వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి బొత్స సత్యనారయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం దారుమణమన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టె మండలి చైర్మన్‌ వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లును అడ్డుకోవడం విచరకరమన్నారు. మండలిలో టిడిపి ఎమ్మెల్సీల తీరు అభ్యంతరకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చంద్రబాబు ఆలోచన అని బొత్స దుయ్యబట్టారు. ఈ పరిణామాల వల్ల వికేంద్రీకరణ బిల్లు జాప్యం జరగవచ్చు కానీ..అమలు చేసి తీరుతామని బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/