బిగ్ బాస్ 5 : ఫస్ట్ వీక్ కు గాను నామినేట్ అయినా ఇంటి సభ్యులు వీరే ..

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ఆదివారం మొదలైంది. ఫస్ట్ డే సభ్యుల ఎంట్రీ..టాస్క్ లతో సరదా సరదాగా సాగగా..సెకండ్ డే ఫస్ట్ వీక్ నామినేషన్ల పర్వం మొదలైంది. ఇందులో కంటెస్టెంట్లు అందరూ తాము నామినేట్‌ చేయాలనుకునే వ్యక్తి ఫేస్‌ ఉన్న బ్యాగును చెత్తడబ్బా వేసి..నామినేషన్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో ఇంటి సభ్యులంతా నామినేట్ చేయడం మొదలు పెట్టారు. అయితే కొందరు దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటుంటే మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.

ఇక ఫస్ట్ వీక్ నామినేట్ అయినా సభ్యులు ఎవరంటే..

  • రవి
  • మానస్‌
  • సరియు
  • కాజల్
  • హమీదా
  • జాస్వంత్ లు నామినేట్ అయ్యారు. మరి వీరిలో హౌస్ ను వదిలి ఎవరు వెళ్తారో చూడాలి.