కరోనాతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ వెల్లడి

AP State Election Commissioner Ramesh Kumar

Amaravati: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ పడింది. కరోనాతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ వెల్లడించారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నామన్నారు.

కరోనాతో ఎన్నికల ప్రక్రియకు అవరోధం రాదని అనుకున్నామన్నారు. కరోనా ప్రభావం దేశంలో తీవ్రంగా ఉందన్నారు.

కేంద్రం కూడా కరోనాను విపత్తుగా గుర్తించిందన్నారు. కరోనా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని, కరోనా ముప్పు ఉన్నందున స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రక్రియ పున:ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరిస్తామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/