ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు

MLA Maddali Giri
MLA Maddali Giri

Guntur: సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

శంకర్ విలాస్ సెంటర్‌లోని రెడీ మేడ్ దుస్తుల దుకాణంపై కొందరు దౌర్జన్యం చేశారు. తాళాలు పగలగొట్టి రూ. కోటీ యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించారు.

దీనిపై బాధితులు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్పీ కూడా స్పందించలేదు.

అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించాడు.

ఎమ్మెల్యే మద్దాలి గిరి వత్తిడి కారణంగానే పోలీసులు మౌనం వహిస్తున్నారని, తన షాపులో సామాగ్రిని అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు ఉందని బాధితుడు శివ ప్రసాద్ తన పిటిషన్‌లో ఆరోపించాడు.

తన షాపును వారు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే తనను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు.

వారికి మద్దతుగా ఎమ్మెల్యే అండగా ఉండి వత్తిడి చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యే గిరితో సహా పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/