హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో దుర్ఘటన

క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ప్రమాదం..ఏడుగురు కూలీలు దుర్మరణం

visakha-shipyard-crane-accident

విశాఖ: విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ క్రేన్ కూలిన సంఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భారీ క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఈ క్రేన్ హిందూస్థాన్ షిప్ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ప్రమాదంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/