మార్చి 12 న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా

home-minister-amit-shah

హైదరాబాద్ః మార్చి 12 న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో స్టేట్ బిజెపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరుగుతాయి. తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.