అల్లు స్టూడియోస్‌లో అల్లు రామ‌లింగ‌య్య విగ్రహ ఆవిష్కరణ

అల్లు స్టూడియోస్‌లో అల్లు రామ‌లింగ‌య్య విగ్రహ ఆవిష్కరణ

ఈరోజు (అక్టోబర్ 01) అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతి సందర్భాంగా హైద‌రాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు రామ‌లింగ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అల్లు బాబీ , అల్లు అర్జున్ , శిరీష్ లు తన తాతగారైన అల్లు రామ‌లింగ‌య్య‌కు నివాళులు అర్పించి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రామ‌లింగ‌య్య అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అల్లు కుటుంబ స‌భ్యులు, అల్లు స్టూడియోస్ సిబ్బందితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలలో రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అలాగే కళాశాలలో రూ.2 కోట్లతో నిర్మించిన కొత్త భవనాన్ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, నిర్మాత అల్లు అరవింద్‌ హాజరు కానున్నారు.