తిరుమల వెంకన్నను దర్శించుకున్న బన్నీ ఫ్యామిలీ

తిరుమల వెంకన్నను దర్శించుకున్న బన్నీ ఫ్యామిలీ
Allu Arjuna familly-Trivikram

తిరుమల తిరుపతి వెంకటేశుని సన్నిధానానికి బన్ని కుటుంబ సమేతంగా వెళ్లారు. వెంకన్న సామి మొక్కును తీర్చారు. బన్ని వెంటే స్నేహారెడ్డి – అల్లు అర్హ- అయాన్ సహా చిత్రబృందం ఉన్నారు. ఈ బృందంలో దర్శకుడు త్రివిక్రమ్ పక్కనే నడుచుకుంటూ వస్తున్న బన్ని కుమార్తె అర్హను ఎత్తుకుని కనిపించారు. ఇంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేప్పుడు బన్ని ఎంతో స్టైలిష్ లుక్ తో కనిపించారు. ఇప్పుడిలా దైవసన్నిధానంలో ప్రత్యేకించి డ్రెస్ కోడ్ తో కనిపించడం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇక అన్ని పార్టీలు అయి పోయాయి కాబట్టి తదుపరి సుకుమార్ దర్శకత్వం లో రెగ్యులర్ షూటింగ్ కి ఎటెండ్ కావాల్సి ఉంటుంది. గంధపు చెక్కల స్మగ్లర్ల కథతో రూపొందుతున్న చిత్రమిది. థాయ్ ల్యాండ్ అడవుల్లో సుక్కూ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/