లాభాలతో ప్రారంభమయిన స్టాక్‌మార్కెట్లు

ఇటలీ, స్పేయిన్‌లో కరోనా తీవ్రత తగ్గడంతో పుంజుకుంటున్న మార్కెట్లు

stock market
stock market

ముంబయి: గతవారం నష్టాలను చవిచూసిన స్టాక్‌మార్కెట్లు, ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఒక వైపు ఇటలీ, స్పేయిన్‌ దేశాలలో కరోనా తీవ్రత తగ్గుతుండడం, మరోవైపు కరోనాను ఎదుర్కోనేందుకు ప్రపంచదేశాలు చర్యలు చేపట్టడంతో మదుపర్లలో ఆశలు పెరిగాయి. దీనితో నేడు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కొద్ది సేపటికి క్రితం సెన్సెక్స్‌ 1,127 పాయింట్ల లాభంతో 18,818 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 344 పాయింట్ల లాభంతో 8,434 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/