ట్రంప్ కు రాష్ట్రపతి విందు..మన్మోహన్​ దూరం

సోనియాను ఆహ్వానించకపోవడమే కారణమట

Manmohan Singh
Manmohan Singh

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందులో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం పొందిన వారి జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. అయితే, ఆ విందుకు ఆయన హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్ సమాచారం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని మన్మోహన్ చెప్పినట్టు సమాచారం. కానీ, అసలు కారణం అది కాదని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ఈ విందుకు ఆహ్వానించకపోవడం వల్లే మన్మోహన్ వెళ్లడం లేదని తెలుస్తోంది. మన్మోహనే కాదు ఆహ్వానం అందుకున్న కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ కూడా విందుకు వెళ్లడం లేదని సమాచారం.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/