ఏజెంట్ నుండి అఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

అక్కినేని అఖిల్ హాలీవుడ్ హీరోల మారాడు. 2015 సంవత్సరంలో వచ్చిన అఖిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టాడు అఖిల్. మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో నాల్గో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, వక్కంతం వంశీ కథతో ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్ గా అఖిల్ నటిస్తున్నాడు. ఆ పాత్రకు తగ్గరీతిలో అదిరిపోయే మేకోవర్ తో అఖిల్ సిద్దమయ్యాడు. న్యూ ఇయర్ సందర్బంగా అఖిల్ తాలూకా లుక్ ను రివీల్ చేసారు.

తన కండలు తిరిగిన దేహంతో ఫోటోకి ఫోజులు ఇచ్చి అమ్మాయిలకు మన్మధుడి గా మారాడు. “2022 లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు లైట్ యువర్ ఫైర్ “అంటూ చొక్కా లేకుండా దిగిన ఫోటోలు షేర్ చేశాడు అఖిల్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఏజెంట్ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‏గా నటిస్తుండగా.. కీలక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.