యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ…

నందమూరి బాలకృష్ణ సోమవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చిత్ర యూనిట్ దర్శించుకుంటున్నారు. ఇటీవల తిరుపతి, విజయ వాడ వెళ్ళిన బాలయ్య సోమవారం యాదాద్రి నరసింహ స్వామి ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలయ్య వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని పేర్కొన్నారు.

ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలని కోరారు బాలయ్య. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో అని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నాం అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చామని వెల్లడించారు. యాదాద్రి ఒక అద్భుతమని.. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందన్నారు నందమూరి బాలకృష్ణ.