టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌డ్ల ను కొనుగోలు చేయాలంటూ బిజెపి ధర్నాలకు పిలుపు

bandi sanjay

వరి కొనుగోలు విషయంలో తెరాస vs బిజెపి యుద్ధం నడుస్తుంది. గత రెండు రోజులుగా బండి సంజయ్ , కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కేంద్రం.. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా బీజేపీ కూడా నిరసనలకు రెడీ అయ్యింది.

గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకు ఆందోళనలు చేయాలని నిర్ణయించామని బీజేపీ నేతలు తెలిపారు. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులను భయబ్రాంతులకు గురి చేయకుండా కనీస మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.ఈ నెల 12 న రాష్ట్రంలో ఉన్న అన్ని మండ‌ల కేంద్ర‌ల తో పాటు ప్ర‌తి చోట కేంద్ర ప్ర‌భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ ఎస్ పార్టీ ఆందోళ‌నల కు పిలుపును ఇచ్చింది. ధర్నాలకు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రం వ‌డ్లు కొంటుందా? కొన‌దా? అనేది తేలిపోవాలని కేసీఆర్ అన్నారు.